మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? అని ఇటీవల ఓ తమిళ ఛానల్‌కి చెందిన ఇంటర్‌వ్యూలో సమంతను అడిగితే -‘‘ఎప్పటికప్పుడు సక్సెస్ కిక్కును దించేసుకోవడమే’’ అని సమాధానమిచ్చారు. ఇంకా ఆమె మాట్లాడుతూ -‘‘‘దూకుడు’ నా కెరీర్‌లో మరిచిపోలేని సినిమా. అయితే... ఆ సినిమా ఇచ్చిన కిక్‌ను ఎప్పుడో దించేసుకున్నాను. హిట్ కొట్టడం కష్టం కాదు. ఆ హిట్ ఇచ్చిన ఇమేజ్‌ని నిలబెట్టుకోవడం కష్టం. దానికి ఎంతో శ్రమించాలి. అందుకే సినిమాలను ఎన్నుకోవడం నుంచి, ప్రతి విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాను. ప్రస్తుతం నా ఆలోచన మొత్తం ‘ఈగ’ పైనే. |