Tuesday, 21 February 2012

నా సక్సెస్ సీక్రెట్ అదే


మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? అని ఇటీవల ఓ తమిళ ఛానల్‌కి చెందిన ఇంటర్‌వ్యూలో సమంతను అడిగితే -‘‘ఎప్పటికప్పుడు సక్సెస్ కిక్కును దించేసుకోవడమే’’ అని సమాధానమిచ్చారు. ఇంకా ఆమె మాట్లాడుతూ -‘‘‘దూకుడు’ నా కెరీర్‌లో మరిచిపోలేని సినిమా. అయితే... ఆ సినిమా ఇచ్చిన కిక్‌ను ఎప్పుడో దించేసుకున్నాను. హిట్ కొట్టడం కష్టం కాదు. ఆ హిట్ ఇచ్చిన ఇమేజ్‌ని నిలబెట్టుకోవడం కష్టం. దానికి ఎంతో శ్రమించాలి. అందుకే సినిమాలను ఎన్నుకోవడం నుంచి, ప్రతి విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాను. ప్రస్తుతం నా ఆలోచన మొత్తం ‘ఈగ’ పైనే. 

నా కెరీర్‌లోనే ఇది డిఫరెంట్ మూవీ’’ అని చెప్పారు సమంత. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నటించడం కష్టం అనిపించలేదా? అనడిగితే -‘‘కొంచెం ఇబ్బందిగానే ఉంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం వల్ల కెరీర్ కాస్త సాఫీగా సాగుతోంది’’ అని సమాధానమిచ్చారు సమంత. బాలీవుడ్ గురించి మాట్లాడుతూ -‘‘గౌతమ్‌మీనన్ సినిమా ద్వారా బాలీవుడ్‌లో నటించబోతున్నాననే వార్తలు ఇటీవల వచ్చాయి. అది ఇంకా పూర్తిగా ఫైనలైజ్ కాలేదు. సౌత్ సినిమాలకే నా తొలి ప్రధాన్యత. ఇక్కడ ఖాళీ దొరికితేనే అక్కడ చేస్తాను’’ అని చెప్పారు.
                             

0 comments:

Post a Comment